
Karthi Kaithi 2 Heroine:
సౌత్ ఇండియా దర్శకుల్లో టాప్‌లో ఉన్న లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాగా కూలీ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వచ్చే ఆగస్ట్ 14, 2025న థియేటర్లలో విడుదల కానుంది. కూలీ తర్వాత లోకేశ్ తన లోకేశ్ సినమాటిక్ యూనివర్స్ (LCU) లో మిగిలిన ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేయనున్నాడు.
ఈ యూనివర్స్‌లో తదుపరి మూవీగా కైతి 2 తెరకెక్కనుంది. కార్తి హీరోగా నటించిన మొదటి భాగం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్‌గా కైతి 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడే తాజాగా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం, కైతి 2 లో అనుష్క శెట్టి కూడా కీలక పాత్ర పోషించనుందని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఆమె పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనుందని టాక్. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
View this post on Instagram
మరో విశేషం ఏమిటంటే, కార్తి-అనుష్క కాంబినేషన్‌కు ఇదే మొదటి సారి కాదు. వీరిద్దరూ గతంలో అలెక్స్ పాండియన్ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మళ్లీ వారిద్దరి కాంబినేషన్ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఎగ్జయిట్‌మెంట్ పెరిగిపోయింది.
లోకేశ్ కనగరాజ్ స్టైల్లో పవర్‌ఫుల్ యాక్షన్, ఇంటెన్స్ థ్రిల్లర్‌తో కైతి 2 కూడా పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక అనుష్క గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తే ఇది మరో హైలైట్ కానుంది. త్వరలోనే చిత్రబృందం నుంచి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.