HomeTelugu Big Storiesహ్యాపీ బర్త్‌డే నాన్న: మహేష్‌ బాబు

హ్యాపీ బర్త్‌డే నాన్న: మహేష్‌ బాబు

Mahesh babu wishes to his fటాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన 78వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్‌ బాబు ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేశారు.

కృష్ణ కూతురు మంజుల కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నా హృదయంలో మీకు చాలా గొప్ప స్థానం ఉంది. నా జీవితంపై మీ ప్రభావం చాలా ఉంది. మీరే నా హీరో, నా రోల్‌ మోడల్‌. లవ్‌ యూ సో మచ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.


ఆయన అల్లుడు, హీరో సుధీర్‌బాబు కూడా కృష్ణపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య. సూపర్‌ హ్యూమన్‌, సూపర్‌ స్టార్‌గా రెండు వెర్షన్లలో నేను మీకు పెద్ద అభిమానిని’ అంటూ సుధీర్‌బాబు ఎంతో ప్రేమతో విషెస్‌ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu