సితార అన్న గౌతమ్‌ గురించి సీక్రెట్ చెప్పేసింది..!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కుమార్తె సితార ఎంత ఎనర్జిటిక్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తండ్రితో పాటు షూటింగ్స్, సినిమా వేడుకలకు హాజరయ్యే సితార తండ్రి సోషల్ మీడియా ఖాతాల్లో కూడ హడావుడి చేస్తుంటుంది. అప్పుడప్పుడు వీడియోలు పెడుతూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా కూడ ఆమె తన అన్నయ్య గౌతమ్ గురించి చెబుతూ మా అన్నయ్య ఒక పెద్ద ఫ్యామిలీ గాయ్ అంటూ వీడియో చేసింది. మహేష్ ఆ వీడియోను తన ఇన్‌ స్ట్రాగ్రామ్‌ అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతోంది.