
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘గుంటూరు కారం’ చేస్తున్న సంగతి తెలసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై భారీ హైప్స్ ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా ఆయన తన సోషల్ మీడియా లో ఓ ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటో ఇప్పుడు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కళ్లకు గ్లాసెస్ లైట్ గా గడ్డంలాంగ్ హెయిర్ తో కనిపించారు. ఈ ఫోటోకి క్యాప్షన్ గా కమింగ్ సూన్ అని పెట్టారు. మరి అది సినిమా కోసమా లేక ఏదైనా వాణిజ్య ప్రకటన కోసమా అనేది తెలియాల్సి ఉంది. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ లో వైరల్ అవుతుంది.













