మహేష్, పూరీ సినిమా ఉంటుందా..?

mahesh

 

 

మహేష్ బాబు ‘పోకిరి’,’బిజినెస్ మెన్’ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు పూరీ జగన్నాథ్
అతి త్వరలోనే ‘జనగణమన’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తానని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ
సినిమా ఉండకపోవచ్చనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎందుకంటే మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్
దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పూరీ సినిమా
చేయాల్సివుంది కానీ అనూహ్యంగా కొరటాల శివతో మహేష్ బాబు సినిమా చేస్తున్నట్లు
తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల వెల్లడించారు. డిసంబర్ నుండి షూటింగ్
మొదలవుతుందని కూడా చెప్పారు. డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అంటే ఇక పూరీ, మహేష్ సినిమా ఇప్పట్లో లేనట్లే అని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మరి
పూరీ, మహేష్ కోసం ఎదురుచూస్తాడో.. లేక మరో హీరోతో సినిమా చేస్తాడో.. చూడాలి!