అభిమానులకి, ప్రేక్షకులకి కృతజ్ఞతలు: మహేష్‌ బాబు

మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం నిన్న విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది తన 25 వ చిత్రం కావడంతో మహేష్ సైతం ఈ విజయాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు. సినిమాను ఇంత పెద్ద విజయం చేసినందుకు అభిమానులకి, ప్రేక్షకులకి తన తరపున, తన టీమ్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వంశీ పైడిపల్లి దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పివిపి సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో అలరించారు.