చిరంజీవి సెంటిమెంట్‌తో కార్తీ.. 60 రోజులు నైట్ షూట్!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ను మలుపుతిప్పిన సినిమా ఖైదీ. ఈ సినిమా సూపర్ హిట్టైంది. దీని తరువాత మెగాస్టార్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజకీయాల్లోనుంచి తిరిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మెగాస్టార్ తనకు కలిసి వచ్చిన ఖైదీ పేరుతో ఖైదీ నెంబర్ 150 సినిమా చేశారు. ఇది సూపర్ హిట్టైంది. మెగాస్టార్ రీ ఎంట్రీ అదుర్స్ అనడంతో ఇప్పుడు సైరా చేస్తున్నారు.

ఖైదీ పేరుతో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఓ సినిమా చేస్తున్నాడు. జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు. ఆ తరువాత ఏంటి అనే కధాంశంతో సినిమా తెరకెక్కింది. 60 రోజులపాటు సినిమాను కేవలం నైట్ టైమ్ లో మాత్రమే షూట్ చేశారు. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అందరిని ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.