HomeTelugu Trendingమేకింగ్ వీడియో ఆఫ్ సలార్‌ 'సీజ్‌ఫైర్'

మేకింగ్ వీడియో ఆఫ్ సలార్‌ ‘సీజ్‌ఫైర్’

Making Video of Salaar Ceas
పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించగా..శృతిహాసన్‌ హీరోయిన్‌గా న‌టించింది. క్రిస్మస్‌ కానుకగా.. ఈ శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ న‌ట‌న‌ మూవీకే హైలైట్ అని అభిమానులు అంటున్నారు. ఈక్రమంలో తాజాగా ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ మేకింగ్‌ వీడియోను చిత్రబృందం సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది. ‘మేకింగ్ వీడియో ఆఫ్ సలార్‌ సీజ్‌ఫైర్‌’ పేరిట ఈ వీడియో విడుద‌ల చేయ‌గా.. ‘సీజ్‌ఫైర్‌’ను తీర్చిదిద్దడంలో టీమ్ చేసిన హార్డ్ వ‌ర్క్ క‌నిపిస్తుంది. ఇక సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు సన్నివేశాలను ఈ వీడియోలో చూడవ‌చ్చు. మ‌రోవైపు ప్ర‌భాస్ స్టైలిష్‌గా ఇదివరకెన్నడూ కనిపించని మాస్ లుక్‌లో పక్కా ఎంటర్‌టైన్‌ మెంట్ అందించిన‌ట్లు తెలుస్తుంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu