విరాట్ కోహ్లీతో ఎన్టీఆర్‌ ..వాటే కాంబినేషన్

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, స్టార్ హీరో ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి పనిచేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే ఓ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కోసం క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారని తెలుస్తోంది. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు సంభవించడం, ప్రాణాలు పోవడం, ఒకరు చేసిన తప్పుకు అనేక కుటుంబాలు బాధపడటం వంటి అంశాల మీద ఈ కార్యక్రమం ఉంటుందట. దీని కోసం ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తారట. వీరితో పాటే ఇంకొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుతారని టాక్‌.