మలయాళంలో అమల రీఎంట్రీ!

మలయాళంలో అమల రీఎంట్రీ!
నాగార్జునను పెళ్లి చేసుకున్నా తరువాత అక్కినేని అమల సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. మొన్నామధ్య శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే సినిమాలో కనిపించిన అమల ఆ తరువాత మరే సినిమాకు సైన్ చేయలేదు. రీసెంట్ గా ఓ మలయాళం సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లుగా 
తెలుస్తోంది. పెళ్ళికి ముందు అమల చాలా సినిమాల్లో నటించింది. అందులో మలయాళ చిత్రాలు కూడా ఉన్నాయి. ఉల్లడక్కమ్ ఆమె చివరి మలయాళ సినిమా. ఆ తరువాత మలయాళ సినిమాల్లో నటించలేదు. సుమారుగా పాతికేళ్ళ తరువాత ఇప్పుడు మలయాళం సినిమాతో అక్కడ రీఎంట్రీ ఇవ్వనున్నారు. సోని అనే ఓ కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘C/o సైరభాను’ చిత్రానికి సైన్ చేసిందామె. మంజు వారియర్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అమల ఓ లాయర్ పాత్ర పోషిస్తోంది. ఓ ముస్లిం గృహిణి, ఆమె కొడుకుల మధ్య గల అనుబంధాలతో నడిచే కథ అని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. 
CLICK HERE!! For the aha Latest Updates