HomeTelugu Big Storiesమంచువారి బిగ్గెస్ట్ మల్టీస్టారర్..

మంచువారి బిగ్గెస్ట్ మల్టీస్టారర్..

9 13టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా, మల్టీస్టారర్ ట్రెండ్‌ నడుస్తుంది. ఈ నేపధ్యంలో మంచు ఫ్యామిలీ నుంచి కూడా బిగ్ బడ్జెట్ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. మంచి హిట్టు కొట్టాలనే ఉద్దేశ్యంలో మంచు ఫ్యామిలీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం మోహన్ బాబు స్పెషల్ పాత్రలతో మెప్పిస్తున్నప్పటికి గతంలో మాదిరిగా సోలో సక్సెస్ లు అయితే అందుకోలేదు. గాయత్రి సినిమాతో సక్సెస్ అందుకోవాలని మోహన్ బాబు చాలా ప్రయత్నించాడు. కానీ సినిమాకు పెట్టిన బడ్జెట్‌లో సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది.

ఇక మంచు యంగ్‌ హీరోలు విష్ణు, మనోజ్ కూడా హీరోగా సరైన స్థాయిలో నిలదొక్కుకోలేకపోతున్నారు. అయితే వీరి కోసం మోహన్ బాబు ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. తన కొడుకులతోనే కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారట మోహన్ బాబు. సొంత ప్రొడక్షన్ లోనే వారి మార్కెట్ కి మించిన బడ్జెట్ ని పెట్టబోతున్నారట. గతంలోనే మోహన్ బాబు తన కొడుకులతో కలిసి మోహన్ బాబు ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. ఇక మళ్ళీ మంచు ఫ్యామిలీ కలిసి నటించలేదు. అయితే ఈ సారి ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని మోహన్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

9a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu