HomeTelugu Trendingమంచు విష్ణు 'డి&డి'

మంచు విష్ణు ‘డి&డి’

1 1
టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు డి&డి సినిమాని అధికారికంగా ప్రకటించారు. 13 ఏళ్ళ క్రితం శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ‘ఢీ’ మూవీ ఎంత హిట్‌ అయిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా డి&డి తీయనున్నారు. డబుల్ డోస్ ఉపశీర్షికతో ఢీ ఫ్రాంచైజీలోని మొదటి చిత్రం కంటే డబుల్ డోస్ యాక్షన్ కామెడీ ఉంటుందని అర్థమవుతోంది. ఆసక్తికరంగా టైటిల్ రెండక్షరాలు భేడీలతో ముడిపడి ఉన్నాయి. అన్న సందేహం కలగక మానదు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో విష్ణు మంచు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. అవరం భక్త మంచు దీనిని సమర్పిస్తున్నారు. ఢీ సహా అనేక బ్లాక్ బస్టర్లలో భాగమైన శ్రీను వైట్ల అభిమాన రచయిత గోపి మోహన్ మరోసారి వైట్లతో కలిసి ఈ మూవీ కోసం పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత కిషోర్ గోపుతో కలిసి గోపీమోహన్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నారు. భారతదేశం నంబర్ వన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ని మరోసారి విష్ణు టీమ్ బరిలో దించారు. హీరోయిన్ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu