HomeTelugu Trendingమంచు విష్ణుకి జోడిగా కోమలి సిస్టర్‌!

మంచు విష్ణుకి జోడిగా కోమలి సిస్టర్‌!

Heroshini Komali as a heroi
మంచు విష్ణు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఢీ సీక్వెల్స్‌ ‘డి అండ్ డి – డబుల్ డోస్’ అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అవరమ్ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఢీ’తో పోలిస్తే… డబుల్ కామెడీ మరియు యాక్షన్ ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది వైరల్‌ అవుతుంది.

ఈ చిత్రంలో విష్ణుకి జోడీని వెతకడం ప్రారంభించాడని తెలుస్తోంది. ‘ఢీ’ చిత్రంలో విష్ణు సరసన హీరోయిన్ జెనీలియా నటించగా.. ‘డి & డి’ చిత్రంలో యంగ్‌ హీరోయిన్‌లను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలో అను ఇమ్మాన్యుయేల్, ప్రగ్యా జైస్వాల్ పేర్లు వినిపించాయి. తాజాగా మరో పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. హిరోషిని కోమలి ని హీరోయిన్ గా తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. కాగా ఇప్పటికే కోమలి టాలీవుడ్‌లో ‘అఆ’ సినిమాలో నితిన్ కి చిన్న చెల్లిగా నటించింది. అలానే గతేడాది ‘ఉట్రాన్’ అనే సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు విష్ణు సినిమాలో తీసుకుంటున్నారని అంటున్నారు. మరి చివరకు విష్ణు కి జోడీగా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి గోపీమోహన్ – కిశోర్ గోపు రచయితలుగా వర్క్ చేస్తున్నారు. మోహనకృష్ణ ఛాయాగ్రహణం అందిస్తుండగా.. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu