HomeTelugu Big Stories'మోసగాళ్లు' ట్రైలర్‌

‘మోసగాళ్లు’ ట్రైలర్‌

Mosagallu Trailer
హీరో మంచు విష్ణు, టాలీవుడ్‌ చందమామ కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో మోసగాళ్లు చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ తెలియజేశారు. ఇక ఈట్రైలర్‌లో ‘డబ్బు సంతోషాన్ని ఇస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను పెంచేస్తుంది.

ఇక ఎప్పటినుంచో సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న విష్ణు ఈ సినిమాతో అనుకున్న స్థాయి హిట్ అందుకుంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు. జాఫ్రె చిన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మంచు విష్ణు సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. నవదీప్, నవీన్‌ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu