చరణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు!

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత చరణ్ ను తన బ్యానర్ లో సినిమా చేయమని అడుగుతున్నాడట నిర్మాత దానయ్య. ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఇది
ఇలా ఉండగా.. రామ్ చరణ్ నిర్మాతగా.. చిరంజీవి 151వ సినిమా ‘సై.. రా నరసింహారెడ్డి’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చారిత్రక నేపధ్యంతో కూడుకున్నది కావడంతో షూటింగ్ పూర్తి కావడానికి ఏడాది సమయమైనా.. పడుతుంది.

అప్పటివరకూ నిర్మాతగా వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవాలా..? లేక హీరోగా మరో సినిమా మొదలుపెట్టాలా..? అనే
విషయంలో చరణ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయానికి రాలేక సతమతమవుతున్నాడని తెలుస్తోంది. చిరు 150వ చిత్రాన్ని కూడా చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా నిర్మాణ వ్యవహారాలు చరణ్ కంటే చిత్ర దర్శకుడు వినాయక్ ఎక్కువగా చూసుకున్నాడు. మరి 151 విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. చూడాలి!