HomeTelugu Newsకంగనా నిర్మాతకు అస్వస్థత

కంగనా నిర్మాతకు అస్వస్థత

10 15‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న కమల్‌ జైన్‌ అస్వస్థతకు గురయ్యారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కమల్‌కు గొంతు ఇన్ఫెక్షన్‌కు గురైయ్యారు. దాంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని కమల్‌ సన్నిహితులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కమల్‌ ట్విటర్‌లో ‘మణికర్ణిక’ బృందాన్ని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఆస్పత్రిలో చేరాల్సిన సమయం కాదిది. కష్టపడిన దానికి ఫలితం దక్కుతున్న నేపథ్యంలో అనారోగ్యానికి గురికావడం అంతకంటే సబబు కాదు. ‘మణికర్ణిక’ ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్రబృందాన్ని చాలా మిస్సవుతున్నాను. వీలైనంత త్వరగా నేను కోలుకుని వస్తాను. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నందుకు జీ స్టూడియోస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ డ్రీమ్‌ ప్రాజెక్ట్ అయిన ‘మణికర్ణిక’ సక్సెస్‌ పార్టీని అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటామని ఆశిస్తున్నాను. జై హింద్‌’ అని పేర్కొన్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu