HomeTelugu Trendingఅంబులెన్స్‌ ఆలస్యం.. హీరోయిన్‌ మరణం

అంబులెన్స్‌ ఆలస్యం.. హీరోయిన్‌ మరణం

6 17ప్రజల ప్రాణాలను కాపాడటానికి అంబులెన్స్ లు నిత్యం పరుగులు తీస్తుంటాయి. అవకాశం ఉన్న ప్రతి ప్రాణిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తుంటాయి. ప్రమాదం జరిగిన గంటలోపు సూచించిన హాస్పిటల్ కు తీసుకెళ్తే.. దాదాపుగా ప్రాణాలు రక్షించవచ్చని వైద్యులు చెప్తుంటారు. అయితే, ఒక్కోసారి అంబులెన్స్ లు అందుబాటులో ఉండకపోవడంతో ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. ఇలాంటి సంగటన మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరిగింది.

మరాఠీ సినిమా హీరోయిన్ పూజా జుంజర్ పురిటినొప్పులతో హింగోలి జిల్లాలోని జార్జియన్ హాస్పిటల్ లో చేరింది. హాస్పిటల్ లో చేరిన కొద్దిసేపటికే ఆమె బిడ్డకు జన్మను ఇచ్చింది. ఆ బిడ్డ పుట్టిన కొద్దిసేపటికి మరణించింది. పూజా పరిస్థితి విషమించడంతో అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హింగోలి హింగోలి హాస్పిటల్ కు తీసుకెళ్లవలసినదిగా చెప్పడంతో.. అంబులెన్స్ కోసం ఆమె బంధువులు ట్రై చేశారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్ సహాయంతో హింగోలి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం 2 గంటల సమయంలో జరిగింది. మహారాష్ట్రలో ఎన్నికల హడావుడి ఉండటంతో ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. పూజ మరాఠీలో రెండు సినిమాలు చేసింది. ప్రెగెన్సీ కారణంగా సినిమాలకు కొంత విరామం ప్రకటించి తన సొంత గ్రామానికి వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!