మరో ‘ఆపరేషన్ దుర్యోధన’ ఈ ‘మెంటల్’!

శ్రీకాంత్, అక్ష నాయ‌కానాయిక‌లుగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘మెంటల్’. ఈ సినిమాని ఎస్‌.కె.బ‌షీద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.కె.క‌రీమున్నీసా నిర్మిస్తున్నారు. ఈనెల 9న దాదాపు 300 థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ థియేట‌ర్‌లో చిత్ర‌యూనిట్ మాట్లాడింది.
స‌మ‌ర్ప‌కుడు బ‌షీద్ మాట్లాడుతూ.. ”ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌, ఖ‌డ్గం సినిమాల త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజు సినిమా ఇది. శ్రీ‌కాంత్ న‌ట‌న సినిమాకే హైలైట్‌. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌లో ఎమోష‌న్స్‌ని మించిన ఎమోష‌న్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రాన్ని దాదాపు 300 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తాను. అన్ని ప్ర‌ధాన థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యేలా ప్ర‌య‌త్నం చేస్తున్నా. నేను శ్రీ‌కాంత్ అన్న‌కు పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా. మెంట‌ల్ ఈ సీజ‌న్‌కే సెన్సేష‌న‌ల్ హిట్ మూవీ అవుతుంది. నైజాం, ఏపీలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా మరో ‘ఆపరేషన్ దుర్యోధన’ అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇటీవ‌లే అవుట్ పుట్ చూస్తే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. అలాగే సాయి కార్తిక్ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నా మాకోసం ఈ సినిమాకి ప‌నిచేసి మంచి సంగీతాన్ని అందించాడు. దర్శక నిర్మాతలందరూ ఈ సినిమా కోసం చాల కష్టపడ్డారు. వారందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని చిత్రాలు వ‌స్తాయి” అని అన్నారు.
ఈటీవీ ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ -“శ్రీ‌కాంత్ అన్న‌తో క‌లిసి ఇది నా రెండో సినిమా. ఇందులో ఓ ప‌వ‌ర్‌ఫుల్ కాప్ పాత్ర‌లో శ్రీ‌కాంత్ అద‌ర‌గొట్టేశారు. సినిమా మైండ్ బ్లోవింగ్‌. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌, ఖ‌డ్గంని మించిన సినిమా అవుతుంది. మీ ఆశీస్సులు కావాలి“ అన్నారు.
ద‌ర్శ‌కుడు బాబ్జీ మాట్లాడుతూ.. ”ఆప‌రేష‌న్ దుర్యోధ‌న ఎమోష‌న్స్‌ని మించిన ఎమోష‌న్స్ ఈ చిత్రంలో ఉంటాయి. చాలా స‌న్నివేశాల్లో శ్రీ‌కాంత్ న‌ట‌న‌కు క్లాప్స్ ప‌డ‌తాయి. అవ‌కాశం ఇచ్చిన నా నిర్మాత‌ల‌కు థాంక్స్‌” అన్నారు. 300 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న బ‌షీద్ ఈ సినిమాతో పెద్ద విజ‌యం అందుకోవాల‌ని అతిధులు ఆకాంక్షించారు.

CLICK HERE!! For the aha Latest Updates