7 కోట్లతో అల్లు అర్జున్ క్యారవాన్ !

టాలీవుడ్‌ హీరో స్టైలిష్ ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్న బన్నీ ఇంకో ఏర్పాటు కూడా చేసుకుంటున్నాడు. అదే కొత్త క్యారవాన్. ఇప్పటికే 3 కోట్లు పెట్టి బ్రాండ్ న్యూ క్యారవాన్ కొన్న బన్నీ ఇంకో మూడు కోట్లు పెట్టి దాన్ని అన్ని రకాల హంగులతో విలాసవంతంగా తయారుచేయించుకుంటున్నాడట. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇకపోతే బన్నీ సుకుమార్ డైరెక్షన్లో కూడా ఒక సినిమాను ఫైనల్ చేసి ఉన్నాడు.