HomeTelugu Trendingధనుష్‌ పాడిన 'మాస్టారు మాస్టారు' సాంగ్‌కి నెటిజన్లు ఫిదా

ధనుష్‌ పాడిన ‘మాస్టారు మాస్టారు’ సాంగ్‌కి నెటిజన్లు ఫిదా

Mastaaru Mastaaru Dhanush R
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘సార్’. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలై ఈసినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలోని సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ చిత్ర యూనిట్ అదిరిపోయే ట్రీట్ అందించింది.

చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. బీజీఎం, సాంగ్స్ ను అద్భుతంగా అందించారు. ముఖ్యంగా సినిమా నుంచి వచ్చిన ‘మాస్టారు మాస్టారు’ సాంగ్‌ సెన్సేషనల్ హిట్ గా మారిన విషయం తెలిసిందే. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్, శ్వేత మోహన్ పాడిన ఈ సాంగ్ అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే దీన్ని మెయిల్ వెర్షన్ లో తాజాగా విడుదల చేశారు. ఈ పాటను ధనుష్ స్వయంగా పాడటం ఆలపించాడు.

ఈ పాటను తాజాగా తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేశారు. ధనుష్‌కు పాట పాటడం ఇదేం కొత్త కాదు. ధనుష్‌ తన నటనతోనే కాకుండా అద్భుతమైన గొంతుతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. దీంతో నెటిజన్లు ధనుష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏం పాడావయ్యా… నీ గొంతులో ఏదో మ్యాజిక్‌ ఉంది అంటూ.. కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సాంగ్ వైరల్ అవుతుంది.

 

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu