
మెగా బ్రదర్ నాగబాబును మంత్రి ఆర్కే రోజా ట్విటర్ వేదికగా కుమ్మేశారు అని జగన్ మీడియా రాసుకొచ్చింది. నిజమే.. రోజాకి కుమ్మడం అలవాటే. అయినా ఈ కుమ్ములాటలు, గుద్దలాటలు రోజాకి తెలిసింనంతగా మరెవ్వరికీ తెలియదు లేండి. ఈ విషయం నిజమే అంటూ నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అదీ రోజాకి ఉన్న స్టాండర్డ్. ఇంతకీ రోజా ఎందుకు ఫీల్ అయ్యిందో తెలుసా ?, నాగబాబు.. రోజా అని ఎలాంటి ముందూ, వెనుకా ఎలాంటి గౌరవం లేకుండా మాట్లాడాడట.
నాగబాబు అలా మాట్లాడ్డంపై రోజా ఫైర్ అయింది. ఫైర్ అంటే ఏమీ లేదులే అండి. జస్ట్ బూతులు తిట్టడమే. పనిలో పనిగా రోజా సూక్తులు కూడా చెప్పింది అండోయ్. “విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చెయ్యాలి లేదా నోటికి ఎంత వస్తే అంత వాగడం కరెక్ట్ కాదు అంది. ఒక్కసారి మనం రోజా స్పీచ్ లు విందాం. అప్పుడు ఈ సూక్తి ఎవరికీ బాగా సూట్ అవుతుందో మనకు ఇట్టే అర్ధం అయిపోతుంది. ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చెయ్యటం రోజాకే చెల్లుతుంది. జగన్ టీమ్ నుంచి ఏ స్క్రిప్ట్ ఐతే వస్తోందో.. దానికి బూతులు యాడ్ చేసి చెప్పడం తప్ప రోజాకు ఏం తెలుసు ?,
పైగా మెగా ఫ్యామిలీ గురించి రోజా మాట్లాడుతూ.. ‘ఏపి గురించి మీకున్న జ్ఞానం శూన్యం అని అందరికీ తెలుసు, నా శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం నీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం!!” అంటూ నాగబాబును రోజా విమర్శించింది. నిజాలు మాట్లాడుకుంటే.. మెగా ఫ్యామిలీ వల్ల రాజకీయాలు మారకపోవచ్చు. కానీ.. వేలమందికి మెగా ఫ్యామిలీ కారణంగా ఉపాధి కలుగుతుంది. పైగా బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో మేలు జరుగుతుంది. మరి రోజా వల్ల పర్సనల్ గా ఎవరికీ అయినా ఏమైనా మేలు జరిగిందా ?,
నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్ప రోజా అంతకు మించి ఏమైనా ఏనాడూ అయినా ప్రజలకు మంచి చేసిందా ?. నాగబాబు ‘మున్సిపాలిటీ కుప్పతొట్టితో రోజాను పోల్చినట్టే.. ఆమె ఇన్నేళ్లు అందుకే పనికొచ్చింది. అందుకే, నెటిజన్లు కూడా రోజా పాత వీడియోలను తెరపైకి తెచ్చారు. ఆ వీడియోల్లో ఆమె రాజశేఖర్ రెడ్డిని బండ బూతులు తిట్టింది. అలాగే వారి ఇంట్లో ఆడవాళ్లను కూడా తిట్టింది. ఇప్పుడు చంద్రబాబును, పవన్ ను తిడుతుంది. కాబట్టి, రోజా నోరే బూతుమయం, ఆమె కేవలం తిట్టడానికే పనికొస్తోందని అనుకోవచ్చు.













