విలన్‌గా మారిన వరుణ్ తేజ్‌..?

మెగా ఫ్యామిలీనుంచి వచ్చిన యువ నటుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం’ రేపు విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీని తరువాత వచ్చే సంక్రాంతికి మంచి వినోదాత్మక సినిమా రిలీజ్ అవుతుంది. ఇది పూర్తి స్థాయి వినోదభరితమైన సినిమా. ఈ రెండు సినిమాల తరువాత వరుణ్ తేజ్.. తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ రీమేక్ లో నటిస్తున్నట్టు తెలుస్తున్నది. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్టైంది. పెట్ట సినిమాకు
దర్శకత్వం వహిస్తున్న కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకుడు.

తెలుగులో ఈ సినిమాను హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడు. జిగర్తాండలో బాబీ సింహా చేసిన విలన్ క్యారెక్టర్ కు మంచి పేరు వచ్చింది. ఆ పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నట్టుగా సమాచారం. హీరో సిద్దార్ధ్ చేసిన పాత్ర కోసం ప్రస్తుతం అన్వేషణలో ఉన్నారు. జనవరి 26 నుంచి సినిమా ప్రారంభం కాబోతుంది. 14 రీల్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది.