మెగామేనల్లుడితో రకుల్ స్టెప్పులు!

ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది రకుల్ ప్రీత్ సింగ్.
దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ భామ మెగా హీరోయిన్ అనే స్టాంప్ కూడా వేయించుకుంది.
ప్రస్తుతం అమ్మడు రామ్ చరణ్ ‘దృవ’ సినిమాలో నటిస్తూనే.. మెగామేనల్లుడు సాయి ధరం తేజ్,
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘విన్నర్’ సినిమాలో కూడా నటించడానికి
సిద్ధ పడింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. సాయి
ధరం తేజ్, రకుల్ ల మధ్య ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చలి అధికంగా
ఉండడంతో తేజు, రకుల్ ఇద్దరూ.. దుప్పట్లు కప్పుకొని మరీ డాన్స్ చేసేస్తున్నారు. దీనికి
సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను రకుల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఒక వ్యక్తి తన జీవితంలో
ఎదురైన సమస్యలను ఎలా ఎదిరించి విజేతగా మారాడనే కథతో ఈ సినిమా రూపొందనుంది. ఈ
చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.