HomeTelugu Trending'పెళ్లిసందD' హీరోయిన్‌కు మెగా ఆఫర్‌!

‘పెళ్లిసందD’ హీరోయిన్‌కు మెగా ఆఫర్‌!

Mega offer to Sri Leela

‘పెళ్లిసందD’సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల వరుస ఆఫర్లు వస్తున్నాయి. రాఘవేంద్ర రావు మెచ్చిన హీరోయిన్ అవ్వడంతో పాటు ఆమెను చూసిన ప్రతి ఒక్కరు వావ్ అనాలి అనిపించేంత అందంగా ఉంది. మొదటి సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడికి ఆఫర్లు రావడం మొదలు అయ్యాయి. ఇప్పటికే రవితేజ సినిమాలో శ్రీలీలకు అవకాశం దక్కింది. తాజా సమాచారం ప్రకారం ఈమెకు మరో ఇద్దరు యంగ్ హీరోల నుండి కూడా ఆఫర్లు అందాయనే వార్తలు వస్తున్నాయి.

Mega offer to Sri 2

మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీలకు మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ దక్కిందట. ఇటీవల ఒక మెగా హీరోకు జోడీగా ఈమె నటించే అవకాశం ను దక్కించుకుందని.. చర్చల దశలో ఉన్న ఆ మెగా మూవీ ని వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో శ్రీలీల నటించబోతున్న ఆమె మూవీ ఏంటీ.. ఏ మెగా హీరోతో నటించబోతుంది అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే శ్రీలీలకు మెగా ఆఫర్ వచ్చింది అనేది నిజమే అంటూ మీడియా వర్గాల వారు కూడా అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu