HomeTelugu Trendingబాలయ్య సాంగ్ రీమిక్స్‌తో అల్లరి నరేష్‌

బాలయ్య సాంగ్ రీమిక్స్‌తో అల్లరి నరేష్‌

Swathilo muthyamantha
అల్లరి న‌రేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. 1983లో బాలకృష్ణ నటించిన ‘బంగారు బుల్లోడు’ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా ‘బంగారు బుల్లోడు’ టైటిల్ ని తీసుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఈ సినిమాలో రాజ్‌-కోటి సంగీత సార‌థ్యంలో రూపొందిన ‘స్వాతిలో ముత్యమంత’ పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ సాంగ్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సాంగ్‌ని అల్ల‌రి న‌రేష్ త‌న చిత్రం కోసం రీమిక్స్ చేశాడు.

అల్ల‌రి న‌రేష్‌, పూజా జ‌వేరి ఈ పాట‌కు ఆడిపాడ‌గా, తాజాగా ఈ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియో రీలిజ్‌ చేశారు. సాయి కార్తీక్ సంగీతం అందించగా.. రేవంత్, న‌డ‌ప్రియ ఆల‌పించారు. లేటెస్ట్ సాంగ్ కూడా శ్రోతల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. గిరి పల్లిక దర్శకత్వం వహించారు. జనవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu