HomeTelugu Trendingరామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ ట్రిబ్యూట్ సాంగ్

రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ ట్రిబ్యూట్ సాంగ్

Mega Power Star Tribute Son
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ సందడి ఓ రెంజ్‌లో ఉంది. మార్చ్ 27న చెర్రీ బర్త్ డే కావటంతో ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి రామ్‌ చరణ్‌ లుక్‌ విడుదలైంది. తాజాగా మెగా పవర్ స్టార్ కి మరపురాని విజువల్ గిఫ్ట్ ని అందించారు అభిమానులు. మథుర ఆడియో వారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్ నెటిజన్స్ ను అలరిస్తోంది. ‘మెగా పవర్ స్టార్’ అంటూ సాగే ఈ ఫ్యాన్ సాంగ్ కి ‘ఎస్‌జేపీ’ లిరిక్స్ అందించటంతో పాటూ పాడారు కూడా. మధ్యలో వినిపించే జోష్ ఫుల్ హిందీ ర్యాప్ అరిన్ డెజ్ ఆలపించారు. ‘ద డ్రాప్ లెట్జ్’ అందించిన సంగీతం చరణ్‌ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించేలా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu