HomeTelugu Trendingమెగాస్టార్‌తో కలిసి మరోసారి జతకట్టనున్న సీనియర్ నటి

మెగాస్టార్‌తో కలిసి మరోసారి జతకట్టనున్న సీనియర్ నటి

trisha chiru movieMEGA STAR: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భారీ బడ్జెట్‍తో సోషియో ఫ్యాంటసీ అంశంతో రూపొందిస్తున్నారు. బింబిసార ఫేమ్ డైరెక్టర్ విశిష్ట ఈ సినిమాకు డైరెక్టర్. చిరంజీవికి ఈ ప్రాజెక్టును మెగా156గా పిలుస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ముహూర్తం కార్యక్రమం కూడా జరిగింది. ఈ మూవీకి హీరోయిన్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మెగా156 సినిమాలో సీనియర్ నటి త్రిషను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి పక్కన స్టాలిన్ మూవీలో త్రిష నటించింది. మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు.

మూవీ యూనిట్ ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు. ఇందులో త్రిష నటిస్తుందని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

మెగా156 సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్‍ను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలే స్క్రిప్ట్ పేపర్ల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ మూవీ షూటింగ్‍లో త్వరలోనే చిరంజీవి పాల్గొననున్నారు.

మెగా156 చిత్రంలో అనుష్కను హీరోయిన్‍గా తీసుకోవాలనుకున్నారట. క్యారెక్టర్‌కు తగినంతగా అనుష్క బరువు తగ్గలేదని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు త్రిషనే మేకర్స్ కన్ఫర్మ్ చేశారట. తాజాగా లియో, పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‍లోనూ త్రిష ఫేమస్ అయింది.

త్రిషను తీసుకుంటే తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రెస్పాన్స్ బాగుంటుందని మేకర్స్ ఆలోచించినట్టు తెలుస్తోంది. త్రిషతో పాటు మరికొందరు హీరోయిన్లు కూడా ఈ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి మెగా156 చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మూడు లోకాల మధ్య తిరిగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

చిరంజీవి సినిమాలో దగ్గుబాటి రానా కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu