ట్రోల్స్‌పై చిరంజీవి కామెంట్స్‌..


టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవలే సోషల్‌ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన ఆయన రెగ్యులర్ గా ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు చిరంజీవి. ఈ నేపథ్యంలో, చిరుపై నలువైపుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, అడపాదడపా ఆయన్ని ట్రోల్ చేస్తున్న వారు కూడా లేకపోలేదు. ఈ ట్రోలింగ్ పై ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి స్పందించారు.

ట్రోలింగ్ అనేది నవ్వుకునేలా ఉంటే బాగుంటుందని… నవ్వుల పాలయ్యేలా ఉండకూడదని మెగాస్టార్‌ అన్నారు. తనకు కూడా ట్రోల్స్ వచ్చాయని.. వాటిని చూసి టైమ్ వేస్ట్ చేసుకోనని చెప్పారు. అలాంటి వారి నీచ బుద్ధి మారదని… తప్పుగా మాట్లాడితే వారి నీచత్వమే బయటపడుతుందని అన్నారు. ట్రోల్ చేసుకునే వారిని చేసుకోనివ్వండని ఆయన సమాధానం ఇచ్చారు.