HomeTelugu Newsమెగాస్టార్‌ కొత్త సినిమా లుక్ లీక్.. వైరల్‌

మెగాస్టార్‌ కొత్త సినిమా లుక్ లీక్.. వైరల్‌

14 12
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం నుండి లుక్ లీకైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. షూటింగ్ స్పాట్ నుంచి ఫోటో ఒకటి నెట్లింట్లో ఇప్పుడు సందడి చేస్తుంది. నక్సలైట్ గెటప్‌‌లో మెడలో ఎర్ర కండువా వేసుకుని నిల్చున్న మెగాస్టార్ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా చిరు లుక్ అదిరిపోయింది. 20 ఏళ్ల కింద చిరంజీవి ఎలా ఉన్నాడో.. ఈ సినిమా కోసం అలా మారిపోయాడు.

సైరా కోసం అప్పట్లో కాస్త బరువు పెరిగినట్లు కనిపించిన చిరు.. ఇప్పుడు మళ్లీ కొరటాల కోసం బరువు తగ్గిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. రంగస్థలం షూటింగ్ చేసిన సెట్లోనే భారీ సెట్ వేసారు ఈ మూవీ కోసం. అక్కడే 50 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసాడు డైరెక్టర్‌. ఈ చిత్రం నక్సలిజం నేపథ్యంలో తెరక్కెకుతున్నట్లు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లీక్ అయిన ఫోటో చూస్తుంటే అది నిజమే అని తేలిపోయింది. రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక
పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తుంది. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. దీనికి ‘ఆచార్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ లుక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu