HomeTelugu Trending'క్లాప్‌' టీజర్‌ని రిలీజ్‌ చేసిన చిరంజీవి

‘క్లాప్‌’ టీజర్‌ని రిలీజ్‌ చేసిన చిరంజీవి

Chiranjeevi launched aadhi

ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం ‘క్లాప్’. రామాంజనేయులు – రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, క్రీడా నేపథ్యంలో కొనసాగనుంది. పృథ్వీ ఆదిత్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా నుంచి చిరంజీవి చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. ఈ టీజర్ లో ఆది పినిశెట్టి అథ్లెట్ గా కనిపిస్తున్నాడు. నేషనల్ లెవెల్లో బంగారు పతకాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంటాడు.

అందుకోసం పట్టుదలతో కసరత్తు చేస్తూ కనిపించాడు. కానీ టీజర్ చివరిలో ఆయన రెండు కాళ్లను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా చూపించారు. ఆకాంక్ష సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక కీలకమైన పాత్రను ప్రకాశ్ రాజ్ పోషిస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. బ్రహ్మాజీ కనిపించనున్నారు. టీజర్ తోనే సినిమా పై అంచనాలు పెంచేయాలనే మేకర్స్ ప్రయత్నం ఫలించేలానే ఉంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu