HomeTelugu TrendingNagarjuna Multi-Starrer Movies: ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశాడంటే!

Nagarjuna Multi-Starrer Movies: ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశాడంటే!

Nagarjuna Multi-Starrer Movies

Nagarjuna Multi-Starrer Movies: అక్కినేని నాగార్జున.. టాలీవుడ్‌లో హీరోగా కమర్షియల్ ఫార్ములా సినిమాలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. సోలో హీరోగా డిఫరెంట్ మూవీస్ చేస్తాను, కథ నచ్చితే వాటిని స్వయం గా అతనే నిర్మిస్తూ మన్మధుడు, సత్యం, లాంటి క్లాసిక్ హిట్స్ ఇండస్ట్రీకి ఇచ్చాడు నాగ్.

ఒకవైపు సోలో హీరో గా, నిర్మాతగా సినిమాలు చేస్తానే మరో వైపు కథ బలంగా ఉంటె ఇతర హీరోలు తో కలిసి స్క్రీన్ షేర్ చేస్కోడానికి ఎప్పుడు ముందు ఉంటారు నాగార్జున. అతిథి పాత్రల్లో కూడా మెరుస్తూ ఉంటారు. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు నాగార్జున పలు మల్టీ-స్టారర్ సినిమాలు చేశాడు.

పాత తరం లో లెజెండరీ ఏఎన్ఆర్, కృష్ణ లతో పాటు.. ఇప్పటి యంగ్‌ హీరోలు కార్తీ, నాని, అల్లరి నరేష్‌ల వరకు నాగార్జున చేసిన మల్టీస్టారర్ మూవీలు ఎంటో ఒక్కసారి చూద్దాం..

ఇద్దరు ఇద్దరే
1990లో విడుదలైన చిత్రం ఇద్దరు ఇద్దరే. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు , నాగార్జున మరియు రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్కినేని వెంకట్ మరియు యార్లగడ సురేంద్రలు అన్నపూర్ణ స్టూడియోస్ మరియు SS క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.

Nagarjuna Multi-Starrer Movies

కలెక్టర్ గారి అబ్బాయి
1987లో బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కలెక్టర్ గారి అబ్బాయి’. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, రజని, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్. ఎస్. క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ సురేంద్ర నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా పంపిణీ చేయబడింది. ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.

వారసుడు
1993 లో యాక్షన్ మూవీగా వచ్చిన చిత్రం ‘వారసుడు’. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. కిషోర్ నిర్మించారు, మురళీ మోహన్ సమర్పణలో EVV సత్యనారాయణ దర్శకత్వం వహించారు. నాగార్జున , నగ్మా , కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా 200 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని అప్పట్లో సంచలన సృష్టించింది.

సీతా రామరాజు
1999 లో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో వచ్చిన సినిమా సీతారామరాజు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ, సంఘవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను నాగార్జున, డి. శివప్రసాద్ రెడ్డి కలిసి గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. పోసాని కృష్ణ మురళి సంభాషణలు అందించాడు. ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.

ఇద్దరి అన్నదమ్ముల మధ్య అనుబంధం, వారిద్దరికీ ఒక చెల్లి. ఆమె గురించి వారిమధ్య భేదాభిప్రాయాలు లాంటి వాటి చుట్టూ కథ ఉంటుంది. ఈ సినిమాకి పలు అవార్డులు వచ్చాయి.

నిన్నే ప్రేమిస్తా
2000 సెప్టెంబరు 14 న విడుదలైన సినిమా ‘నిన్నే ప్రేమిస్తా’. ఈ సినిమాలోని పాటలు అన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఎస్. ఎ. రాజ్‌కుమార్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్‌ అనే చెప్పాలి. ప్రముఖ సంగీత దర్శకుడు కె. చక్రవర్తి ఈసినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది.

Nagarjuna Multi-Starrer Movies స్నేహమంటే ఇదేరా
2001లో విడుదలైన చిత్రం స్నేహమంటే ఇదేరా. బాలశేఖరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున, సుమంత్, భూమిక, ప్రత్యూష హీరోహీరోయిన్‌లుగా నటించారు. సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి శివరాం శంకర్‌ సంగీతం అందించారు. లాల్ నిర్మాతగా సిద్ధిక్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన ఫ్రెండ్స్ అనే చిత్రం ఈ చిత్రానికి రీమేక్‌ ఈ మూవీ.

కృష్ణార్జున
2008 లో పి. వాసు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘కృష్ణార్జున’. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ఫై వచ్చిన ఈసినిమాలో మంచు విష్ణు, నాగార్జున, మమత మోహన్ దాస్, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు.

మనం
2014లో విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘మనం’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని కుటుంబం నిర్మించింది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు , నాగార్జున , నాగ చైతన్య , సమంతా రూత్ ప్రభు , శ్రియ శరణ్ నటిస్తున్నారు. అక్కినేని అమల, అఖిల్‌ కూడా అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్‌ అని చెప్పాలి. పునర్జన్మ మరియు శాశ్వతమైన ప్రేమ భావనలతో ఈ సినిమా వచ్చింది.

ఊపిరి
2016లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఊపిరి. ఇది ఫ్రెంచి మూవీ “ది ఇన్‌టచబుల్స్” రీమేక్‌. పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్నా హీరోయిన్‌గా నటించింది.

దేవదాస్
2018 లో దేవదాస్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్విని దత్ నిర్మించి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించినభారతీయ తెలుగు, యాక్షన్ కామెడీ మూవీ. నాని, నాగార్జున అక్కినేని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. మణి శర్మ ఈసినిమాకి సంగీతం అందించారు.

Nagarjuna Multi-Starrer Movies

వీటితో పాటు .. 2022లో విడుదలైన ‘బంగార్రాజు’ సినిమాలో నాగచైతన్యతో కలిసి స్రీన్‌ పంచుకున్నారు. 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి ప్రీక్వెల్‌‌‌గా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాలో అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.

వీటితో పాటు 2024లో విడుదలైన సినిమా ‘నా సామిరంగ’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహించాడు. నాగార్జున, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా మంచి టాక్‌తో కలెక్షన్స్‌ రాబట్టింది.  కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్, నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఈమూవీకి సంబంధించిన అప్డేట్స్‌ రావాల్సి ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu