HomeTelugu Trendingశ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి కుటుంబ సమేతంగా మెగాస్టార్

శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి కుటుంబ సమేతంగా మెగాస్టార్

megastar chiranjeevi t1

‘హనుమాన్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈవేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అయెధ్యలో శ్రీ రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందినట్లు చెప్పారు. జనవరి 22వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఉత్సవానికి హాజరు కాబోతున్నట్లు వెల్లడించారు.

యావత్తు భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు జనవరి 16న ప్రారంభమవుతాయి.

megastar chiranjeevi to att

శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి దేశంలోని పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందాయి. సినీ ఇండస్ట్రీ నుంచి రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, మాధురీ దీక్షిత్‌, అనుపమ్‌ ఖేర్‌, అక్షయ్‌ కుమార్‌, అలియా భట్‌, దీపికా పదుకొణె సహా పలువురు స్టార్స్‌కు ఆహ్వానాలు అందాయి. ప్రారంభోత్సవానికి దేశవిదేశాల నుంచి సుమారు 7వేల మంది హాజరవుతారని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu