HomeTelugu Trendingసోహైల్‌కు మెగాస్టార్‌ వరాలు

సోహైల్‌కు మెగాస్టార్‌ వరాలు

Megastar gifts to Sohail
బిగ్‌బాస్‌లో సోహైల్‌ తనదైన స్టైల్‌లో, డైలాగ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టాప్‌3 వరకు వచ్చిన సోహైల్‌ రూ. 25లక్షలు తీసుకొని గేమ్‌ నుండి క్విట్‌ అయిపోయాడు. ట్రోఫీ ఇవ్వడానికి వచ్చిన చిరంజీవి సైతం సోహైల్‌పై వరాల జల్లు కురిపించాడు. కథ వేరుంటాది అనే డైలాగ్‌ తన నెక్స్ట్‌ సినిమాలో పెట్టుకుంటాను అన్నాడు చిరంజీవి. డబ్బుల విషయంలో కూడా సోహైల్‌ని మెచ్చుకున్నాడు చిరంజీవి. సోహైల్‌ కోసం ఇంటి నుండి మటన్‌ బిర్యానీ తీసుకువచ్చాడు. ఇది ప్రత్యేకంగా తన భార్య సురేఖ వండిపంపించింది. సోహైల్ తాను ఓ మంచి సినిమా తీస్తాను అని తన సినిమాకు చిరంజీవిని సపోర్ట్ చేయాలని కోరాడు. దానికి చిరంజీవి తప్పకుండా సపోర్ట్ చేస్తానని అలాగే వీలైతే సోహైల్ సినిమాలో చిన్న క్యారెక్టర్‌ కూడా చేస్తానని హామీ ఇచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu