HomeTelugu Newsకీలకమైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు దక్కించుకున్న మేఘా

కీలకమైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు దక్కించుకున్న మేఘా

ఏపీ అభివృద్ధిలో ప్రముఖ మౌళికసదుపాయాల సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ’ పాలుపంచుకుంటోంది. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టులు పూర్తిచేసిన మేఘా.. ఏపీలోని అత్యంత కీలకమైన ప్రాజెక్టులు చేపట్టింది. ఉత్తర భారతానికి, దక్షిణ భారత్ కు కీలకమైన ఏపీలోని రహదారులను నిర్మిస్తోంది.

flyover open ఆంధ్ర ప్రదేశ్ లో రెండు కీలకమైన ఈ రహదారులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించనుంది. వీటిని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వర్చువల్ పద్దతిలో శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రెండు రోడ్ల నిర్మాణంతో రవాణా వాహనాలకు సమయం, ఇంధనం ఆదా కానున్నాయి.

16వ నెంబర్ జాతీయ రహదారిలో భాగంగా చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు బైపాస్ రోడ్ నిర్మాణం ఎంఈఐఎల్ చేపట్టింది. ఇది 30 కిలోమీటర్ల పొడవున్న ఆరు లేన్ల రహదారి. ఈ రోడ్ నిర్మాణం పూర్తి అయితే వాహన దారులు, ముఖ్యంగా రవాణా వాహనాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

jagan 1

ప్రస్తుతం హైదరాబాద్, కోల్ కతా నుంచి వచ్చే వాహనాలు విధిగా విజయవాడ నగరం గుండా చెన్నై వెళ్ళాలి . ఈ బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్, కోల్ కతాల నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు ఇక నేరుగా వెళ్లవచ్చు. దీని వల్ల సమయం, ఇంధనం ఆదా అవుతాయి. నాయుడు పేట-రేణిగుంట 71వ నెంబర్ జాతీయ రహదారి ని మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ రహదారి రెండు లేన్ల లో మాత్రమే ఉంది. వాహనాల రద్దీ వాళ్ళ నిత్యం ప్రమాదాలు, ట్రాఫిక్ జాం లతో అటు వాహన దారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ప్రధాన పుణ్యక్షేతం తిరుమలకు వెళ్లే రహదారుల్లో ఇది కీలక మైంది. ఈ 57 కిలోమీటర్ల ఆరు లేన్ల రోడ్ నిర్మాణం పూర్తి అయితే అటు తిరుమలకు, ఇటు చెన్నై, అటు బెంగళూరు, రేణిగుంట విమానాశ్రయం, శ్రీకాళహస్తి దేవాలయంపై వెళ్లే వారికి ఏంటో ఉపయుక్తంగా ఉంటుంది. నాయుడుపేట, రేణిగుంత జాతీయ రహదారి లోని నాయుడుపేట, రేణిగుంట, శ్రీకాళహస్తి, ఏర్పేడు పట్టణాలకు బైపాస్ రోడ్డును ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఎంఈఐఎల్ నిర్మిస్తోంది.

జాతీయ రహదారి ప్రోజెక్టుల శంఖుస్థాపన సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం తన వంతు సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించి త్వరలో సి ఎం సమావేశం ఐ చర్చించి సమస్యలు ఏమైనా ఉంటె పరిష్కరించుకోవాలని, తానూ కూడా సమావేశం నిర్వ్హఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రం లో రోడ్ ప్రమాదాల నివారణకు చర్యలు తీసు కోవాలని, అందుకు తానూ పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

jagan

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నెట్ వర్క్ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఇప్పటికే పలు ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని వాటిని ఆమోదించటంతో పాటు, తాము ప్రతిపాదించే మరికొన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకొంటోందని వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!