పోలరవం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారు: మోడీ

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలరవం ఇరిగేషన్ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని విమర్శించారు. పోలవరాన్ని గాలిలో వేలాడు దీస్తున్నారని సెటైర్లు వేసిన ఆయన.. ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయించామని గుర్తుచేశారు. ప్రాజెక్టు అంచనాలను పెంచుకుని పోవడం? ఎవరి ప్రయోజనాల కోసం యూటర్న్ బాబు చేస్తున్నారో అర్ధం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబును యూటర్న్ బాబు, స్టిక్కర్ బాబుగా వర్ణించిన మోడీ… కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు స్టిక్కర్లు అంటించుకుంటున్నారని ఆరోపించారు. దేశంలోని ఉన్నత వర్గాల్లోని నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేంద్రానిదే అన్నారు మోడీ. ఐదేళ్లలో దేశగతిని మార్చేశామని, మరో ఐదేళ్లూ మంచి పాలన అందించడానికి ప్రజల ఆశీర్వాదం కావాలని మోడీ అభ్యర్థించారు. ఐదేళ్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేశామని వెల్లడించారు. రాజమండ్రి, విజయవాడ, విశాఖ ఏయిర్ పోర్టుల విస్తరణ వెనుక నిజాయితీగా పన్ను చెల్లించిన వారే ఉన్నారని స్పష్టం చేశారు. దేశంలోని పన్ను చెల్లింపు దారులందరికీ మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను లేకుండా చేశామని, గత ప్రభుత్వాలు ట్యాక్స్‌ల పరిమితి తగ్గింపును అసలు పట్టించుకోలేదని మోడీ ఎద్దేవా చేశారు. బీజేపీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌ హెరిటేజ్‌ని కాపాడటం… చంద్రబాబు లక్ష్మం తన హెరిటేజ్‌ని కాపాడుకోవడమే అంటూ సెటైర్లు వేశారు మోడీ.