ఎజెంట్‌ సినిమాలో మోహన్‌ లాల్‌!

అక్కినేని అఖిల్ తాజాగా ఐదవ చిత్రం టైటిల్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘ఏజెంట్’ అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో అఖిల్ లుక్ కి ఆకట్టుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. అఖిల్ ఈ చిత్రంలో గూఢచారిగా కనిపిస్తారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అఖిల్ మేకోవర్ ఆసక్తిని కలిగించింది.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావల్సి ఉంది. వైద్య సాక్షి ఈ చిత్రంలో అఖిల్ ప్రేయసిగా కనిపించనుంది. అనీల్ సుంకర.. సురేందర్ రెడ్డి సురేందర్ 2 సినిమా బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates