‘బుర్రకథ’ ట్రైలర్‌

హీరో ఆది ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘బుర్రకథ’. డైమండ్‌ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘రామాయణంలో రాముడికి శత్రువు రావణాసురుడు. కృష్ణుడి శత్రువు కంసుడు. కానీ, నా శత్రువు నాతోనే ఉన్నాడు’ అంటూ ఆది చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఇందులో అభి, రామ్‌ అనే రెండు పాత్రల్లో ఆది కనిపిస్తారు.

అభి అల్లరి కుర్రాడిలా ఉంటాడు. కానీ, రామ్‌ చాలా అమాయకుడు. భక్తి, సన్యాసం వంటివి నమ్మే వ్యక్తిగా కనిపించారు. ట్రైలర్‌ చివర్లో హాస్యనటుడు ’30 ఇయర్స్‌’ పృథ్వీ.. ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌ చెప్పిన ‘ఫ్యాన్స్‌, డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ డైలాగ్‌ చెప్పడం హైలైట్‌గా నిలిచింది. జూన్‌ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.