HomeTelugu News24 గంటల్లో 'వినయ విధేయ రామ' రికార్డులు

24 గంటల్లో ‘వినయ విధేయ రామ’ రికార్డులు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ శుక్రవారం రిలీజ్‌ అయ్యింది. బోయపాటి మార్క్ మాస్‌ యాక్షన్‌ సీన్స్‌తో రూపొందించిన ఈ టీజర్‌ మెగా అభిమానులను అలరిస్తోంది.

13

అంతేకాదు ఈ టీజర్‌ కేవలం 24 గంటల్లో 15.1 మిలియన్ల( కోటీ 50 లక్షలకు పైగా) డిజిటిల్ వ్యూస్‌ సాధించి రికార్డ్‌ సృష్టించింది. ధృవ, రంగస్థలం సినిమాలతో ప్రయోగాలు చేసిన చరణ్‌ ఈ సారి పక్కా కమర్షియల్ సినిమాతో అలరించనున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రశాంత్‌, ఆర్యన్ రాజేష్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu