HomeTelugu Trendingఅల్లుడితో చిందేయనున్న మోనాల్‌

అల్లుడితో చిందేయనున్న మోనాల్‌

Monal gajjar special song

తెలుగు బిగ్‌బాస్-4 కంటెస్టెంట్స్‌కి వరుస ఆఫర్‌లు వస్తున్నాయి. ఒక హౌస్‌లో ప్రేమ పావురంగా గుర్తింపు తెచ్చుకుంది కంటెస్టెంట్‌ మోనాల్ గజ్జర్. టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించనుంది. ఈ సినిమాలో కీలకమైన సన్నివేశంలో వచ్చే ఈ పాటలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు మోనాల్ గజ్జర్ సైతం ఆడి పాడనుంది. ఈపాట కోసం అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో ఓ భారీసెట్ ను వేసి, నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తున్నారు. నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’లో ప్రకాశ్ రాజ్, సోనూసూద్, వెన్నెల కిశోర్ సత్య, కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్‌ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu