HomeTelugu Trendingనవ్వులు పూయిస్తున్న 'భీష్మ' మేకింగ్‌ వీడియో

నవ్వులు పూయిస్తున్న ‘భీష్మ’ మేకింగ్‌ వీడియో

7 18
నితిన్‌, రష్మిక హీరో,హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీయూనిట్‌ మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. సినిమా సెట్స్‌లో సందడి అంతా ఇందులో చూపించారు. ముఖ్యంగా నితిన్‌-రష్మికల మధ్య తెరకెక్కించే సన్నివేశాలు నవ్వులు పంచుతున్నాయి.

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu