HomeTelugu Trending'బంగర్రాజు'లో మోనాల్‌!

‘బంగర్రాజు’లో మోనాల్‌!

Monal in bangarraju

బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు రాగానే.. ఓ డ్యాన్స్‌ షోకి జడ్జిగా వ్యవహరించింది. అంతేకాదు అల్లుడు అదుర్స్‌ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో అదరగొట్టేంది ఈ భామ. ఇలా టీవీ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తున్న ఈ అమ్మడుకి తాజాగా మరో భారీ ఆఫర్‌ వచ్చినట్లు టాక్‌. నాగార్జున హీరోగా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు ‘బంగార్రాజు’ ప్రీక్వెల్స్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగచైతన్య మరో హీరోగా నటిస్తారు. నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ, చైతూకి జంటగా కృతిశెట్టిలను తీసుకున్నారు. ఇప్పుడు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

కథ ప్రకారం సినిమాలో స్వర్గం ఎపిసోడ్ ఒకటి ఉంటుందట. ఇందులో కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఈ ఎపిసోడ్ లో మోనాల్ ఎంట్రీ ఇస్తుందట. స్వర్గంలో రంభగా ఆమె కనిపించబోతుందని సమాచారం. నాగార్జునతో కలిసి మోనాల్ వేసే స్టెప్పులు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఆగస్టు 20 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu