HomeTelugu Trending'బద్రి' హీరోయిన్‌కు కోర్టు నోటీసులు

‘బద్రి’ హీరోయిన్‌కు కోర్టు నోటీసులు

3 1
పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. అందులో ఒకరు అమీషా పటేల్. అదే ఆమె మొదటి తెలుసు సినిమా. తన పెరఫార్మన్స్ తో ఆకట్టుకుంది. సినిమాకు విజయానికి ఆమెకూడా కొంత ప్లస్ అయ్యింది. ఆ తరువాత తెలుగులో నాని, నరసింహుడు, పరమవీర చక్ర వంటి సినిమాల్లో నటించింది. అటు బాలీవుడ్ లోను మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకుంది.

హీరోయిన్ గా బాలీవుడ్ లో సైతం మంచిపేరు తెచ్చుకున్న అమీషా పటేల్ ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి రూ. 10 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ తరువాత ఆ ప్రొడక్షన్ హౌస్ కు ఓ చెక్ ఇచ్చింది. కానీ, ఆ చెక్ బౌన్స్ కావడంతో ప్రొడక్షన్ కంపెనీ కోర్టులో చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసింది. కేసు విచారించిన మధ్యప్రదేశ్ కోర్టు 43 ఏళ్ల అమీషా పటేల్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 27 వ తేదీలోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!