HomeTelugu Trendingమృణాల్ బర్త్‌డే సందర్భంగా హాయ్ నాన్న నుంచి కొత్త పోస్టర్

మృణాల్ బర్త్‌డే సందర్భంగా హాయ్ నాన్న నుంచి కొత్త పోస్టర్

Mrunal Maa Naanna poster

సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్. ఆమె పోషించిన సీత పాత్రను టాలీవుడ్ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ఆ సినిమా హిట్‌తో మృణాల్‌కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో వస్తున్న వీడీ 13(వర్కింగ్ టైటిల్) చిత్రంలో మృణాల్ నటిస్తోంది. మరో సినిమా నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న ‘హాయ్ నాన్న’ చిత్రం.

Muranal Thakur birthday

ఆగస్ట్ 1న మృణాల్ పుట్టిన రోజు సందర్భంగా హాయ్ నాన్న టీమ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. శౌర్యువ్ డైరెక్షన్‌లో మెహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

విజయ్‌ దేవరకొండ మూవీ సెట్‌లో మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆమెతో కేక్ కట్ చేయించారు. ఈ సెలబ్రేషన్స్‌లో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురాంతో పాటు లక్ష్మణ్, హన్షిత రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. మృణాల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu