బన్నీ కొడుకుతో అల్లు శిరీష్‌ బాక్సింగ్.. వీడియో


అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తనకు, తన మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ… ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటాడు. తాజాగా కిక్ బాక్సింగ్ వీడియో ఒకటి షేర్ చేశాడు. ఇందులో అన్నయ్య బన్నీ కొడుకు అయాన్‌తో కలిసి బాక్సింగ్ చేశాడు. ఐతే… అయాన్ దూకుడు ముందు శిరీష్ వెనక్కి
తగ్గాల్సి వచ్చింది. తనకు కొత్త బాక్సింగ్ పార్ట్‌నర్ దొరికాడంటూ… ట్వీట్ చేసి… అందర్నీ ఖుషీ చేస్తున్నాడు శిరీష్. అయాన్ అప్పుడే అంత పెద్దవాడైపోయాడా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ వీడియోను చూస్తూ… లైక్ చేస్తున్నారు.

పరుశురాం దర్శకత్వంలో శ్రీరస్తు శుభమస్తుతో కాస్త హిట్ దక్కినట్లు ఫీలైన అల్లు శిరీష్… చివరిగా ABCD మూవీతో పలకరించాడు. సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన విజేత సినిమాకి దర్శకత్వం చేసిన రాకేష్ శశి చెప్పిన కథ నచ్చడంతో దాన్ని ఓకే చేశాడని తెలిసింది. కమర్షియల్
ఎలిమెంట్స్‌తోపాటూ… ఎమోషనల్‌ టచ్‌తో ఆ సినిమా ఉంటుందని వినికిడి.

CLICK HERE!! For the aha Latest Updates