HomeTelugu Trending'నాకోసం' లిరికల్‌ వీడియో వచ్చేసింది

‘నాకోసం’ లిరికల్‌ వీడియో వచ్చేసింది

Naa Kosam Lyrical Video fro
అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. ఈ సినిమాలోని ‘నా కోసం’ అనే గీతాన్ని (లిరికల్‌ వీడియో) చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ ప్రేమగీతానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. చైతన్య, కృతిశెట్టిపై చిత్రీకరించిన పాట ఇది. ఈ జోడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. కల్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu