HomeTelugu Trendingఅక్షయ్ కుమార్ 'మిషన్ మంగళ్' టీజర్

అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ టీజర్

5 8అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా మిషన్ మంగళ్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15 వ తేదీన విడుదల కాబోతున్నది. మార్స్ గ్రహం మీదకు ఇండియా మామ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇండియా సక్సెస్ అయ్యింది. మార్స్ పైకి ఉపగ్రహాలు ప్రయోగించిన అరుదైన దేశాల జాబితాలో ఇండియా కూడా చేరిపోవడం విశేషం.

ఈ జైత్రయాత్రను బేస్ చేసుకొని మిషన్ మంగళ్ పేరుతో సినిమా తీసింది బాలీవుడ్. దీనికి సంబంధించిన టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. సెలెబ్రిటీలు సైతం టీజర్ ను ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సి, నిత్యామీనన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu