HomeTelugu TrendingNaa Saami Ranga: ఓటీటీలోకి నాగార్జున సినిమా.. ఎప్పుడంటే!

Naa Saami Ranga: ఓటీటీలోకి నాగార్జున సినిమా.. ఎప్పుడంటే!

naa samiranga movie on ott
Naa Saami Ranga: అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి (జనవరి 14) విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‍గా నిలిచింది. గుంటూరు కారం, సైంధవ్ నుంచి గట్టి పోటీ ఎదురైనా.. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను రాబట్టింది.

విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నాగార్జునకు మంచి హిట్ ఇచ్చింది. తాజాగా సామిరంగ ఓటీటీ అప్డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘డిస్నీ ప్లస్ హాట్‍స్టార్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‌లో ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

మీ స్క్రీన్‍లపై ఫైర్ అయ్యేందుకు కింగ్ వస్తున్నాడు. డేట్‍ను ఊహించగలరా అంటూ ఫిబ్రవరి 8న డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ఓ ట్వీట్ చేసింది. దాంతో అందరూ ఫిబ్రవరి 15 నుంచి నా సామిరంగ స్ట్రీమింగ్ అవుతుందని అందరూ ఊహించారు. అయితే అందరి అంచులను తలక్రిందులు చేస్తూ.. ఫిబ్రవరి 17న కింగ్ ఓటీటీలోకి వస్తున్నాడు.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ఆకర్షణగా నిలిచింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu