వివాదంపై స్పందిచిన యాంకర్‌ ప్రదీప్‌

యాంకర్ ప్రదీప్ మాచిరాజు తనపై వచ్చిన వివాదంపై స్పందించాడు. ఓ షోలో ప్రదీప్ మాట్లాడుతూ ఏపీ రాజధాని విశాఖ అని వ్యాఖ్యానించి ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహానికి గురయ్యారు. ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్‌లోని అతడి ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే బుద్ధి చెబుతామని కొలికలపూడి శ్రీనివాసరావు హెచ్చరించడంతో ఈ వివాదం ముదిరిపోయింది. దీంతో ఈ వివాదంపై స్పందించిన ప్రదీప్ తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమించాలంటూ తన సొంత యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates