HomeTelugu Newsఅనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో నాటు నాటు డాన్స్‌.. వైరల్‌

అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో నాటు నాటు డాన్స్‌.. వైరల్‌

Naatu Naatu Dance in Anant

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఈ వేడుకలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు హాజరయ్యారు.

మార్చి 1న శుక్రవారం ప్రారంభమైన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ మూడో రోజున బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్ పాల్గొననున్నారు. అయితే, అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ రెండో రోజు వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించారు బాలీవుడ్ స్టార్‌ హీరోలు షారుక్, సల్మాన్, అమీర్.

యావత్‌ ప్రపంచాన్ని షేక్ చేసిన తెలుగు పాట ‘నాటు నాటు’ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌కు ముగ్గురు స్టార్ హీరోలు డ్యాన్స్ చేసి అభిమానులను హోరెత్తించారు. ఆస్కార్‌ విజేతగా నిలిచిన నాటు నాటు సాంగ్‌కు బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌.. తమదైన స్టైల్‌లో హుక్‌ స్టెప్పులతో కలిసి స్టైలిష్‌ స్టెప్పులేశారు.

రామ్‌చరణ్‌ కూడా వీరితో జాయిన్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈవెంట్‌లో టాలీవుడ్ స్టార్లు రామ్‌చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌ కలిసి సందడి చేయగా.. వారి చూస్తుండగా అద్భుతమైన ఎనర్జీ లెవల్స్‌తో ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు చేసిన నాటు నాటు స్టెప్పుల వీడియో ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!