HomeTelugu Trendingపరశురామ్ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య..

పరశురామ్ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య..

9 12

‘మజిలీ’, ‘వెంకీమామ’ సినిమాల తరువాత నాగచైతన్య మంచి జోష్ మీదున్నాడు. వరసగా రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో తరువాత చేయబోయే సినిమాల విషయంలో మంచి కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నాడు చైతు. చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది.

ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ జనవరి నెలాఖరులో కానీ, ఫిబ్రవరిలో కానీ రిలీజ్ కాబోతున్నది. ఇదిలా ఉంటె, పరశురామ్ దర్శకత్వంలో చైతన్య సినిమా చేయబోతున్నారు. 14 రీల్స్ బ్యానర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. వచ్చే ఈనెల నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. సమంత ఇందులో హీరోయిన్ గా చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరక్కించబోతున్నారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu